Friday, July 30, 2010

మర్యాద రామన్న

http://www.youtube.com/watch#!v=7sNAOzuoEpE&feature=related

సినిమా కబుర్లు.. 
 
తెలంగాణా ఉప ఎన్నికల పోలింగ్ రోజున రెండు continue shifts తర్వాత office కి రెండు రోజులు ఫుల్ ఫ్రీ టైం దొరికింది. ఇంట్లో tv చూస్తుంటే మా అన్న ఫ్రెండ్ saida reddy  వచ్చాడు. కాసేపు అవీ ఇవీ కబుర్లు చెప్పుకున్న తర్వాత సినిమాల టాపిక్ వచ్చింది. 'మర్యాద రామన్న' బాగుందంట, రేపు వెళ్దామా అని అడిగాడు. నాకు కూడా office కి సెలవు కావడంతో సరే అన్నాను. next day mrng 10 కి  మళ్లీ తనే కాల్ చేసాడు. 11.30 వరకు theatre వద్ద కలుద్దాం అని చెప్పాను. అక్కడికి వెళ్లేసరికి చిన్నపాటి జల్లులు స్టార్ట్ అయ్యాయి. తను టికెట్స్ తీసుకొని నాకోసం wait చేస్తున్నాడు. సినిమా స్టార్ట్ కావడానికి ఇంకా టైం ఉండడంతో పక్కనే వేడివేడిగా కాలుస్తున్న మొక్కజొన్న పొత్తుల బండిమీద మా కన్నుపడింది. తీసుకుందామా అని అడిగా. 'ఇప్పుడే టిఫిన్ చేసి వచ్చాను, నాకొద్దు' అన్నాడు. నేను కూడా అపుడే break fast చేయడంతో ఒకటే తీసుకొని share చేసుకున్నాం. ఈలోగా మూవీ టైం కావడంతో రాజమౌళి, సునీల్ combination ఎలా ఉంటుందో చూద్దాం అని అనుకుంటూ theatre లోపలికి వెళ్ళాం.

theatre  అంతా full అయింది. స్క్రీన్ మీద సునీల్ పేరు రావడంతోనే ఒకటే ఈలలు, రాజమౌళి పేరు వచ్చినపుడు కూడా అంతే. 'మగధీర' వంటి మెగా హిట్ తర్వాత రాజమౌళి నుంచి వచ్చిన మూవీ కావడంతో చాలా exiting గా ఫీలయ్యా. మొత్తానికి సినిమా అంతా నవ్వుకుంటూ బాగా ఎంజాయ్ చేసాం. సునీల్ కామెడీ, డాన్స్ తో ఆకట్టుకున్నాడు. తలకిందులుగా సునీల్ డాన్స్, ట్రైన్ లో కొబ్బరి బోండా సీన్ సూపర్. రాజమౌళి direction బాగుంది. తన రెగ్యులర్ అయిన కత్తులు, వేట కొడవళ్ళు మర్చిపోలేదు. సలోని కూడా బాగానే act చేసింది. ఉల్లాసంగా.. ఉత్సాహంగా నటించి నా మనసులో గిలిగింతలు పెట్టింది. నాకు తను బాగా నచ్చుతుంది. అందంగా ఉంటుంది, డాన్స్ బానే చేస్తుంది కానీ తనకెందుకు మరిన్ని అవకాశాలు రావడంలేదో అర్ధం కావడం లేదు. 2005 లో తెలుగులో  'ధన 51'తో కెరీర్ స్టార్ట్ చేసినప్పటికీ ఆరేళ్లలో కేవలం ౩ సినిమాల్లో హీరోయిన్ గా, 2 సినిమాల్లో స్పెషల్ appearance ఇచ్చింది. ఈ తాజా విజయంతో అయినా మరిన్ని సినిమాల్లో తనను చూసే అవకాశం వస్తుందేమో చూడాలి.  విలన్ గా  నటించిన నాగినీడు తెలుగులో మొదటి సినిమా ఐనప్పటికీ బాగా చేసాడు. హీరో సునీల్ సైకిల్ కి మరో హీరో రవితేజ వాయిస్ ఓవర్ చెప్పడం సినిమాకి మరో హైలైట్.

No comments: