Saturday, August 7, 2010

మరదలుతో...





JHANSI REDDY 15 రోజుల క్రితం HYD వచ్చింది. తను మా అత్త కూతురు. మా ఇద్దరి కుటుంబాల మధ్య ఊరిలో గొడవలు ఉన్న కూడా... మేము మాత్రం చిన్నప్పటి నుంచి క్లోజ్ గా ఉండేవాళ్ళం. సూర్యాపేటలో డిగ్రీ చేసేటపుడు అపుడపుడు కలిసేది. MSc చేయడం కోసం చీరాల వెళ్లి,  పూర్తి చేసి జాబ్ కోసం HYD వచ్చింది. నారాయణ కాలేజీలో J.L.గా జాయిన్ అయింది. HYD చూడాలని చెప్పి డ్యూటీలో చేరేందుకు 4 రోజులు time కావాలని కాలేజీలో అడిగింది. రెండేళ్ళ తర్వాత దిల్ సుఖ్ నగర్ లో కలిశాం. అప్పటి నుంచి బయటికి వెళ్దామని చంపుతుంటే week off తీసుకొని నిన్న zooకి వెళ్ళాము. ఇంకో సీక్రెట్ ఏంటంటే మా ఇంట్లో ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్ ఉందని అబద్దం  చెప్పాను. మార్నింగ్ 10 కి బైక్ తీసుకొని బయల్దేరాము. చాలా టైం ఉంది కదా అని ముందు పెద్దమ్మ టెంపుల్ కి వెళ్ళాం. 12 కి అక్కడి నుంచి బయల్దేరాం. మద్యలో తనకి తలనొప్పి అంటే ఒక కేఫ్ దగ్గర ఆగి ఇరానీ చాయ్ తాగాము. బయట హోటల్ లో తిని వెళ్దాం అంటే గుడిలో పులిహోర తిన్నాం కదా, ఆకలి లేదు అని చెప్పింది.. దారిలో జామ పండ్లు కనపడితే హాఫ్ కే.జి. తీసుకున్నాం. అవి తినుకుంటూ జూకి వెళ్ళాం. జూలో పెద్ద తాబేలు, నీటి గుర్రం (హిప్పో పోటముస్), తెల్ల పులి, చిరుతలు, పెద్ద పులులు, సింహాలు, రకరకాల పక్షులు, తెల్ల నెమల్లు, ఏనుగులు, జింకలు చాలా చూసాం. సఫారి పులులు, సింహాలు (అడివిలో ఫ్రీ గా తిరగడం) చూడడం కోసం మళ్లీ 50 టికెట్ తో మినీ బస్సులో చుట్టూ ఫెన్సింగ్ ఉన్న అడివిలోకి వెళ్ళాం. అక్కడ ఒక చోట జింకలు, మరో చోట పులులు, సింహాలు ఫ్రీగా తిరుగుతున్నాయి. అవి కనబడిన చోట  డ్రైవర్ బస్సుని ౩  నిముషాలు ఆపి చూపించాడు. ఒకచోట బస్సు ఆగినపుడు ఎదురుగా అదే రోడ్ మీద పెద్ద పులి వచ్చింది. బస్సు లో అందరి గుండెల్లో భయం... ఎవరూ ఎం సౌండ్స్ చేయొద్దని డ్రైవర్ వార్నింగ్ ఇచ్చాడు. మేం చూస్తుండగానే మా పక్కనుంచి అది గంభీరంగా వెళ్లిపోయింది. అదే బస్సులో ఉండగా ఇంకోచోట ఎలుగుబంటి పక్కగా వచ్చింది. మా వెనుక సీట్ దగ్గరికి రాగానే ముందు రెండు కాళ్ళు పైకి ఎత్తి గట్టిగా అరిచింది. లాస్ట్ సీట్ లో ఉన్నవాళ్లు భయపడి అందరు ఒకపక్కకి వచ్చేసారు. కాసేపు అలాగే ఉన్నతర్వాత అది వెళ్లిపోయింది. బస్సు అలా కొండల మీద వెళ్తుంటే ఒక చోట ఆపి చార్మినార్, ఫలక్ నుమ పాలెస్ చూపించాడు డ్రైవర్. బస్సు దిగిన తర్వాత టైం చూస్తే 4 కావొస్తుంది. lite గా ఆకలివేస్తుందని బెంచ్ మీద కూర్చొని చేతిలో ఉన్న జామకాయలు,  టెంపుల్ లో కొట్టిన కొబ్బరికాయ ముక్కలు తిన్నాం. 5కి క్లోజ్ అవుతుందని, ముందు పాములు ఎక్కడ ఉన్నాయో చూద్దామని అడిగింది తను. సెక్యూరిటీ వాళ్ళు కనబడితే వాళ్ళను అడిగాం, cantene వెనక వైపు ఉంటాయని చెప్పాడు. కాస్త తొందరగా నడుచుకుంటూ వెళ్ళాం. మొసళ్ళు, చిలుకలు, పక్షులు, సీతాకోక చిలుకలు, పెద్ద పావురం ఇంకా చాలా కనిపించాయి. అవన్నీ చూసుకుంటూ పాముల దగరకు వెళ్ళాం. నక్కలు, తోడేళ్ళు చూసాం. అప్పటికి 4 గంటలు నడిచాం కదా ఇద్దరం అలిసిపోయాం. జూ పార్క్ లో మాకు ఎక్కువగా మనకు రెగ్యులర్ గా కనపడే తాబేళ్లు, చేపలు ఎక్కువ చోట్ల పెట్టారని అనిపించింది. జిరాఫీ మాకు ఎక్కడ కనిపించలేదు. చాలా దారులు ఉన్నాయ్ కాబట్టి మద్యలో ఎక్కడో ఒకచోట రూట్ మిస్ అయ్యామేమో అనుకున్నాం. 5.30 కి అక్కడి నుంచి బయల్దేరాం. ఇంటికి వెళ్దామా అని అడిగా, అప్పుడే ఎందుకు కాసేపాగి వెల్దామంది. సరే అయితే గోకుల్ చాట్ కి వెళ్దాం పద అని అక్కడికి వెళ్ళాం. 1 plate భెల్ పురి, 1 plate దహిపురి ఆర్డర్ చేసి షేర్ చేసుకున్నాం. చెరో కుల్ఫీ తిన్నాం. ఈలోగా అమ్ములు మెసేజ్ వచ్చింది ఎంతసేపట్లో వస్తావ్ రా అని.. 20 min అని రిప్లై చేసి బయల్దేరాము. 7 కి తనని హాస్టల్ దగర డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళాను. మొత్తానికి మరదలుతో ఒక పగలు గడిచిపొయింది.


No comments: