Thursday, September 9, 2010

గురువు గారికి వీడ్కోలు..

అవార్డులతో హరి గారు, శేఖర్ రెడ్డి గారు, కేశవ్ గారు..
ఇటీవల CMS అవార్డు అందుకుంటున్న శేఖర్ రెడ్డి గారు..
             కట్టా శేఖర్ రెడ్డి గారు.. నేను చాలా అభిమానించే వారిలో ఒకరు.. 'మహాటీవీ'లో అసోసియేట్ ఎడిటర్. మూడు రోజుల క్రితం మహాటీవీకి వీడ్కోలు పలికారు. కొత్తగా వస్తున్న తెలంగాణ పత్రికకి వెళ్లారని తెలిసింది. మొదట నన్ను ఇంటర్వ్యూ  చేసింది, నాకు ఉద్యోగ అవకాశం ఇచ్చింది ఆయనే. కలిసి పనిచేసిన సంవత్సర కాలంలో ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. ఆఫీస్ లో బాయ్స్ దగ్గర నుంచి అందరితో ప్రేమగా మాట్లాడతారు. ఏ సమస్య వచ్చినా వెళ్లి చెప్పుకునేంత ఫ్రీడమ్ నాకు ఇచ్చారు. 'నేను చూసుకుంటా..' అని ధైర్యం ఇచ్చి ప్రోత్సహించారు. సర్ వెళ్ళిపోతున్న సమయంలో నేను ఆయన్ని కలవలేకపోయాను. శేఖర్ రెడ్డి గారంటే నాకు 'గురువు' భావన ఉంది. 'గురు పూజోత్సవం' మరుసటి రోజే ఆయన వెళ్ళిపోయారు. ఆ రోజు నైట్ డ్యూటీ ఉండడం వల్ల మార్నింగ్ నేను ఆఫీసుకి రాలేదు. ఇపుడు వెళ్లి కలుద్దామంటే ఆ ఆఫీసు ఎక్కడ పెడ్తున్నారో ఇంకా తెలియదు. అడ్రస్ కనుక్కొని వెళ్లి ఒకసారి కలవాలి...

No comments: