Tuesday, September 28, 2010

నీ కోసం..

నా దేహం నుంచి ఆత్మ వేరైన రోజు
నా ఊపిరి ఆగిపోయిన రోజు
ప్రాణం ఈ భూమిని విడిచి వెళ్ళిన రోజు 
నా కోసం పుట్టిందనుకున్న..
ఓ అందమైన పాలరాతి శిల్పం..
నన్ను విడిచివెళ్ళిన రోజు
తను ఇక నాది కాదు అని తెలిసిన రోజు
 వేరొకరి సొంతమైన రోజు 
ఆ రోజే................, తన పెళ్లి రోజు
తను వెళ్లిపోయింది
వేరొకరి సొంతమైంది
ఆకాశం చిన్నబోయింది
నా మనసు మూగబోయింది 
పక్షుల కిలకిలలు వినిపించడం లేదు
అమ్మ తిట్టినా పట్టడం లేదు 
ఎవరైనా కొట్టినా దెబ్బతాకడం లేదు
ఏం చేస్తున్నానో తెలియడం లేదు
ఇలా ఎన్నాళ్ళో.. ఎన్నేళ్లో..

తన కోసం ఈ జన్మే కాదు..
ఎన్ని జన్మలైనా ఎదురు చూస్తా..

No comments: