Monday, August 16, 2010

తొలి ఏడాది..





time:  ఉదయం 10 గంటలు.. ఆగస్టు 16, 2009.. 'MAHAA TV' కార్యాలయం.. ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిసి ఇంటర్వ్యూకి వెళ్ళాను. నాకు 19వ నెంబర్ ఇచ్చారు. బయట కూర్చున్న మిగిలిన వారితో పరిచయాలు అయిపోయాక.. లోపలికి వెల్లివస్తున్న వారిని ఏం అడిగారో తెలుసుకున్నాం. నా నెంబర్ వచ్చింది. లోపలికి వెళ్ళా. శేఖర్ రెడ్డి సర్, అనిల్ సర్ ఇంటర్వ్యూ చేస్తున్నారు. స్పీడ్ ఎంత, ఇంతకు ముందు ఎక్కడ పని చేసావ్.. అని అడిగారు. ఇంకా కొన్ని ప్రశ్నలు కూడా అడిగారు. తర్వాత news desk లోకి వెళ్లి సుబ్బారావు సర్ ని కలవమని చెప్పారు. ఆ సర్ చిన్నపాటి టెస్ట్ లు పెట్టారు. కాసేపటి తర్వాత పిలిచి రేపు ఉదయం 10 గంటలకు రమ్మని చెప్పారు. ఆఫీసు బయటకి వచ్చి చూస్తే సుమారు 100 మంది వెయిట్ చేస్తున్నారు ఇంటర్వ్యూ కోసం..
       తెల్లారి ఉదయం వెళ్ళాను. మొత్తం ఆరుగురు వచ్చారు నాతోపాటు. 4 రోజులు టెస్టుల తర్వాత చెప్తాం, రోజు ఆఫీసుకి రండి అని అన్నారు. అందులో నాతోపాటు ముగ్గురిని 21న అప్పాయింట్ చేసారు.
 ఇప్పుడు.. 
              సంవత్సరం గడిచింది. ప్రమోషన్ వచ్చింది.. కొత్త పని.. ఇపుడు కాస్త హ్యాపీ.. అయినా ఇంకా కష్టపడాలి.. పెద్ద స్థాయికి ఎదగాలి.. ఇతరులకి ఆదర్శంగా నిలబడాలి..

1 comment: