Saturday, August 21, 2010

క్యూ లో 2 గంటలు...

క్యూ లైన్..
గుడి ముందు..
గుడి లోపల..




        నైట్ డ్యూటీ చేసి ఉదయం 8 గంటల సమయంలో ఇంటికి వెళ్ళా. అమ్ములు కాలేజీకి వెళ్ళింది. స్నానం, టిఫిన్ అయిపోయాక నిద్ర రావడం లేదని టీవీ చూస్తున్నా. శ్రావణ శుక్రవారం కదా అమ్మ పూజ చేస్తోంది. 'వెళ్లి పడుకోరా.. సాయంత్రం నువ్ తొందరగా నిద్ర లేస్తే అష్టలక్ష్మి గుడికి వెళ్దాం' అని అమ్మ అంది. పడుకొని 4 గంటలకు నిద్ర లేచా. కాలేజీకి వెళ్లి సర్ ని అడిగి అమ్ముల్ని తీసుకొచ్చా. అమ్ములు, నేను మళ్ళీ స్నానం చేసి వర్షం వచ్చేలా ఉందని అమ్మని తీసుకొని బైక్ మీద తొందరగా గుడికి బయల్దేరాం. అక్కడికి వెళ్లి చూస్తే నైట్ మొత్తం క్యూ లైన్ లోనే ఉండాల్సి వస్తుందేమో అనిపించేంతమంది భక్తులు ఉన్నారు. బైక్ పార్కింగ్ చేసి వచ్చి లైన్లో నిలబడ్డాం. గుడి పక్కన ఉన్న ఇంటి పక్కనుంచి ఆ ఇంటి వెనక్కి నాలుగు వరసలుగా (తిరుమల క్యూ లైన్ మాదిరిగా) ఏర్పాటు చేసారు. మొదట చూసినపుడు పక్క వైపు మాత్రమే లైన్ ఉందని అనిపించింది. తీరా వెళ్లి చూస్తే వెనకవైపు కూడా చాలామంది లైన్ లో ఉన్నారు.చాలా స్లో గా వెళ్తుంది లైన్. ఒకసారి చుట్టూ చూస్తే ఓ నలుగురు ఐదుగురు అందమైన అమ్మాయిలు కనిపించారు. నా పక్క లైన్ లో కొద్ది దూరంగా ఒక అమ్మాయి మాత్రం లంగా ఓణిలో కనపడింది. సూపర్, కేక, అధ్బుతం.. ఇలాంటి పదాలేవీ సరిపోవేమో చెప్పడానికి.. దైవ దర్శనానికి వచ్చి అలా పక్క చూపులు చూడడం తప్పని ఒక పక్క అనిపిస్తోంది, మరోపక్క నా ముందు అమ్మ, చెల్లి ఉన్నారు వాళ్ళెక్కడ నన్ను గమనిస్తారోనని భయంగా ఉంది. కాని వయసు అలాంటిది మరి.. ఎంత వద్దనుకున్నా కళ్ళు మాటిమాటికి ఆ వైపే చూస్తున్నాయి. మా లైన్ చిన్నగా కదుల్తుంటే, వాళ్ళ లైన్ మాత్రం ఎందుకోమరి అలాగే ఉంది. నేను దగ్గరకు వెళ్లేదాక వాళ్ళు అలాగే ఉంటే బాగుండు అనుకున్నాను. వాళ్ళను దాటి ముందుకు వెళ్ళాక ఆగిపోయాం. హమ్మయ్య.. పర్లేదు ఎంత లేట్ అయినా కూడా టైం పాస్ అవుతుందిలే అనిపించింది. ఆమెతోపాటు వాళ్ళ అమ్మ, ఇంకో చిన్న పాప కూడా ఉంది. చిన్నచిన్నగా ముందుకు కదులుతూ.. ఆ అమ్మాయిని ఓ కంట కనిపెడుతూ రెండు గంటల పాటు ఎంజాయ్ చేశా. ఆ తర్వాత మాకు దేవత దర్శన భాగ్యం కలిగింది. గుడి కిందికి వచ్చాక ఆ అమ్మాయి కోసం వెతికా కాని ఎక్కడా కనిపించలేదు. నా కోసం పుట్టిన దేవత ఆమెనో, కాదో తెలియదు. రాసి పెట్టి ఉంటే మళ్ళీ కలుస్తుందిలే అని ఇంటికి వచ్చేసాం.. అప్పటికే 8 కావొస్తుండడం భోజనం చేసి మెల్లగా నైట్ డ్యూటీకి బయల్దేరా...

క్యూ లైన్ లో..
గుడిలో భక్తులు..

No comments: